న్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసిన నాగశౌర్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసిన నాగశౌర్య

'జ్యో అచ్యుతానంద' సూపర్ హిట్ అనిపించుకున్నప్పటికీ నాగశౌర్య ఆ వెంటనే ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. తనకి బాగా నచ్చిన కథలు అనుకున్న రెండు ప్రాజెక్టులకు మాత్రమే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక ప్రాజెక్టుకి దర్శకుడు ఎ. ఎల్. విజయ్ అయితే .. మరో సినిమాకి దర్శకుడు వెంకీ కుడుముల.

 ఎ. ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ షూటింగ్ తాజాగా పూర్తయింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక వెంకీ కుడుముల సినిమాపై నాగశౌర్య పూర్తి దృష్టి పెట్టనున్నాడు. ఈ రెండు సినిమాలు ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతాయో చూడాలి మరి.  
nagashourya

More Telugu News