విశాల్ కి .. కార్తీకి ప్రభుదేవాతో పడటం లేదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాల్ కి .. కార్తీకి ప్రభుదేవాతో పడటం లేదట!

నడిగర్ సంఘం సొంత భవన నిర్మాణం కోసం .. తామిద్దరం పారితోషికం లేకుండా ఒక సినిమా చేయనున్నట్టు కొంతకాలం క్రితం విశాల్ .. కార్తీ చెప్పారు. ఈ సినిమాపై వచ్చిన మొత్తం భవన నిర్మాణానికే కేటాయిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా దర్శకత్వంలో ఈ ఇద్దరు హీరోలు ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాకి 'కరుప్పు రాజా వెల్ల రాజా' (నల్ల రాజా తెల్ల రాజా) అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందేమోనని అనుకుంటూ ఉండగా, విశాల్ .. కార్తీ ఇద్దరూ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ప్రభుదేవాతో సరిపడకపోవడమే వాళ్లు ఈ సినిమా చేయకపోవడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూ .. ఆ దిశగా అభిమానుల్లో అంచనాలు పెంచే పనిలో వున్నారు.
vishal
karthi

More Telugu News