ట్రెడిషనల్ లుక్ లో అందంగా మహేశ్ కూతురు సితార!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రెడిషనల్ లుక్ లో అందంగా మహేశ్ కూతురు సితార!

ఒక వైపున వరుస సినిమాలతో మహేశ్ బాబు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మరో వైపున తన భార్యా బిడ్డల కోసం తగిన సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ఇక కొడుకు గౌతమ్ .. కూతురు సితార అంటే మహేశ్ కి ప్రాణం. ఈ ముగ్గురికి కూడా ఎలాంటి లోటు రాకుండా నమ్రత చూసుకుంటూ ఉంటుంది. తమ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది.

అలాగే తాజాగా గులాబీ రంగు పట్టు పరికిణీలో సితారను అలంకరించి తీసిన ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. ఈ నెల 20వ తేదీన సితార బర్త్ డే కావడంతో ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది. గులాబీ రంగు పట్టు పరికిణీలో .. వడ్డాణం ధరించి .. జెడ కుప్పెలతో సితార సంప్రదాయ బద్ధంగా కనిపిస్తోంది. ముద్దులొలికే సితార ఫోటో .. మహేశ్ బాబు ముచ్చట తీర్చేసే ఫోటోయేనని చెప్పాలి.  
mahesh babu
namrata

More Telugu News