కూతురు ఎంట్రీ గురించి రాజశేఖర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూతురు ఎంట్రీ గురించి రాజశేఖర్!

సాధారణంగా స్టార్ హీరోల తనయులు హీరోలుగా తెరపైకి వస్తుంటారు. తమకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుని, రేస్ లో ముందు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. ఇక స్టార్ హీరోల కూతుళ్ల విషయానికి వస్తే, వాళ్లలో కథానాయికలుగా తెరపైకి వస్తున్న వాళ్లు చాలా తక్కువ. ఇదే విషయాన్ని గురించి రాజశేఖర్ ప్రస్తావించారు.

కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆలోచిస్తున్నవారి అభిప్రాయం సరిగ్గా లేనట్టేననీ, ఇది కూడా అన్ని రంగాల వంటిదేనని ఆయన అన్నారు. ఏ రంగంలో వున్నవారు ఆ రంగంలోనే తమ పిల్లలు కొనసాగాలని కోరుకుంటారనీ, అలాగే తన కూతురు 'శివాని' సినిమా రంగంలో కొనసాగాలని తాను అనుకున్నానని చెప్పారు. తనకి కొడుకు వుంటే హీరోను చేసి ఉండేవాడిననీ .. కూతురు కనుక హీరోయిన్ ను చేస్తున్నానని స్పష్టం చేశారు. శివాని తమిళంలో తన మొదటి సినిమా చేయనుందనే వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.      
rajasekhar
shivani

More Telugu News