మ‌రో క‌ల‌క‌లం.. చాక్లెట్స్ రూపంలో డ్ర‌గ్స్ స‌ర‌ఫరా.. 8,760 చాక్లెట్లు స్వాధీనం

05-07-2017 Wed 18:30 | National
తెలంగాణ‌లో డ్ర‌గ్స్ మాఫియా క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో, స్కూళ్లలో డ్ర‌గ్స్ దందాను బ‌య‌ట‌పెట్టిన పోలీసులు తాజాగా నిజామాబాద్‌లోనూ ఓ వ్య‌క్తిని అరెస్టు చేశారు. గంజాయితో తయారు చేసిన మధుమునక్కా చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పేరు శారద శరత్ కుమార్ అని పోలీసులు తెలిపారు. చాక్లెట్ల రూపంలో డ్ర‌గ్స్ స‌ర‌ఫరా చేస్తున్నాడ‌ని స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళ్లి అతనిని చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. డ్ర‌గ్స్  స్మ‌గ్లింగ్ విష‌యంలో మ‌రెంత మంది హ‌స్తం ఉంద‌నే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

టీనేజ్ పిల్ల‌ల‌ని అటువైపుగా ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుని తెలంగాణ‌లోని స్కూళ్లు, కాలేజీల్లో డ్ర‌గ్స్ ముఠా రెచ్చిపోతోంది. హైద‌రాబాద్‌లో మొత్తం 1000 మందికిపైగా పిల్ల‌లు డ్ర‌గ్స్ కు అల‌వాటు ప‌డ్డార‌ని పోలీసులు అంటున్నారు. టీనేజ్ పిల్ల‌ల‌నే టార్గెట్‌గా చేసుకుని వారితో డ్ర‌గ్స్ ముఠాలోని స‌భ్యులు ప‌రిచ‌యాలు పెంచుకుని, మంచి కిక్ ఇస్తోంద‌ని న‌మ్మిస్తూ డ్ర‌గ్స్‌ను అల‌వాటు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా కూడా పిల్ల‌ల‌కు డ్ర‌గ్స్ ముఠా వ‌ల వేస్తోంది. పిల్ల‌లు డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌ని అనుమానం వ‌స్తే, వారిని వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లాల‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. యూరిన్ టెస్ట్ ద్వారా కూడా డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డిన పిల్ల‌ల‌ని గుర్తించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more