అమెరికా చరిత్రలో రికార్డు నెలకొల్పిన ముస్లింల వలస!

30-01-2017 Mon 21:33 | International
అమెరికాలో 2016 ఆర్థిక సంవత్సరంలో సుమారు 39 వేల మంది ముస్లిం శరణార్థులు కాలుమోపారని గణాంకాలు వెలుగు చూశాయి. ఇంత భారీ మొత్తంలో ముస్లింలు అమెరికాలో ప్రవేశించడం ఇదే తొలిసారి. దీంతో ఇది అమెరికా చరిత్రలోనే రికార్డుగా నమోదైంది. సిరియా శరణార్థులు సహా ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం నేపథ్యంలో ఈ గణాంకాలు వెలుగులోకి రావడం విశేషం. ఇంకా ఈ నివేదిక ద్వారా, సెప్టెంబరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 84,995 మంది శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టినట్టు తెలిసింది. ఒబామా పాలనలోనే ఎక్కువ మంది శరణార్థులు అమెరికాకు వచ్చారని ఈ నివేదిక వెల్లడించింది.

వారే కాకుండా మరో 31,143 శరణార్థులు అక్టోబరు 1 నుంచి జనవరి 24 మధ్య అమెరికాకు వలస వచ్చారని ఈ నివేదిక పేర్కొంది. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత  వీరిలో 1,136 మంది శరణార్థులు జనవరి 20న అమెరికాలో కాలుపెట్టినట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్‌ మెంట్ రిఫ్యూజీ ప్రాసెసింగ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేశాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 2016 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో రికార్డు స్థాయిలో సుమారు 39 వేల మంది ముస్లిం శరణార్థులు అడుగుపెట్టినట్టు తేలింది. ఈ లెక్కన రెఫ్యూజీ అడ్మిషన్లలో సుమారు సగం అంటే 46 శాతం ముస్లింలే ఉన్నారని, వారి తరువాతి స్థానంలో 44 శాతంతో క్రిష్టియన్ శరణార్థులు ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నిషేధాజ్ఞలు పెను దుమారం రేపుతున్నాయి. 

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more