పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేడు బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్ కు ముందు పాక్ జట్టు ప్రాక్టీస్ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు ఫుట్ బాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆ జట్టు బౌలర్లు వాహబ్ రియాజ్, యాసిర్ షా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది పెరిగి తోపులాట వరకు వెళ్లింది. 'నువ్వెంతంటే.. నువ్వెంత' అని సవాల్ విసురుకున్న వీరిద్దరూ ఒకర్నొకరు తోసుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన కోచ్ ఇద్దరికీ సర్ది చెప్పి ప్రాక్టీస్ ముగించారు. అనంతరం వీరిద్దరూ డ్రస్సింగ్ రూంలో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, తామిద్దరం మంచి స్నేహితులమని, ఇలాంటి చిన్నచిన్న విషయాలు మామూలేనని తెలిపారు. తమ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని, తమ గురించి ప్రార్థన చేయాలని అభిమానులకు సూచించారు.
More Telugu News
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్