ఇంజక్షన్ వికటించడంతో బాలింత మృతి చెందిన విషాద సంఘటన హైదరాబాద్ లో జరిగింది. జగద్గిరి గుట్టకు చెందిన బాలింత స్రవంతి ఆరోగ్య సమస్యల నిమిత్తం వారం రోజుల క్రితం కూకట్ పల్లిలోని ఓమ్నీ ఆసుపత్రిలో చేరింది. గత వారం రోజులుగా స్రవంతికి వైద్య సేవలు చేశారు. ఈ క్రమంలో ఆమెను డిశ్చార్జి చేస్తామని నిన్న వైద్యులు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. అయితే, డిశ్చార్జికి ముందు స్రవంతికి పెన్సిలిన్ ఇంజెక్షన్ చేశారని, ఆ ఇంజెక్షన్ వికటించడంతో ఆమె ప్రాణాలు వదిలిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్రవంతి బంధువులు ఆందోళనకు దిగారు. ఆరు రోజుల శిశువుతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రిపై దాడి చేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కాగా, స్రవంతికి సరైన వైద్య చికిత్స అందించామని, వైద్యుల నిర్లక్ష్యం చేయలేదని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. కావాలంటే తమపై కేసు పెట్టుకోండంటూ ఓమ్ని ఆసుపత్రి సీఈఓ డాక్టర్ నగేష్ చెప్పడం గమనార్హం.
More Telugu News
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు