బతుకు బండి సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో తన భర్త కోసం తాను కష్టించి పనిచేసిన డబ్బులతో ఒక ఈ-రిక్షాను కొనుగోలు చేసిన భార్య కలలు కల్లలయ్యాయి. కొన్ని రోజులు ఈ-రిక్షాను నడిపిన భర్త, ఆ రిక్షానే తాకట్టు పెట్టి మద్యం సీసాలు తెచ్చుకోవడం మొదలెట్టాడు. కుటుంబం గడవటం లేదే అని చెప్పి కుంగిపోని ఆ మహిళ కుటుంబ బాధ్యతలను తానే స్వీకరించింది. సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్న ఈ సమాజంలో తాను ఈ-రిక్షాను నడపక తప్పలేదంటున్న ఢిల్లీకి చెందిన ఆ ముస్లిం యువతి పేరు సయ్యదా నస్రీన్. ఢిల్లీలోని కర్కాడుమ్ ప్రాంతానికి వెళ్తే ఈ-రిక్షాతో ఆమె కనిపిస్తుంది. పంజాబీ డ్రెస్ లో తలకు స్కార్ఫ్ ధరించి ఉండే నస్రీన్, కర్కాడుమ్ మెట్రో స్టేషన్ నుంచి జిల్లా కోర్టు వరకు ఈ-రిక్షా సర్వీసు తిప్పుతుంటుంది.
ఏకైక మహిళా ఈ-రిక్షా డ్రైవర్ అయిన నస్రీన్ వాహనంలో ప్రయాణించడానికే అధిక శాతం మహిళా ప్రయాణికులు ఆసక్తి చూపుతుంటారు. అయితే, తమ గిరాకీ పోతోందంటూ మగ ఆటో డ్రైవర్లు కొంచెం బాధపడుతుంటారు. ఈ విషయమై నస్రీన్ ను ప్రశ్నిస్తే.. పొట్టకూటికోసం, తన పిల్లల్ని పోషించుకోవడం కోసం అందరిలాగానే తాను కష్టపడాల్సి వస్తోందని చెబుతోంది. ఆమె నేటి మహిళ మరి!
More Telugu News
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్