ఆసియాలోనే అత్యంత పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్ గా పేరు తెచ్చుకున్న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ. 1200 కోట్ల నుంచి రూ. 1300 కోట్ల మేర నిధులను సమీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ముసాయిదా పత్రాలను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న షేర్ హోల్డర్లే బీఎస్ఈ ఐపీఓ ద్వారా నిధులను రాబట్టే పనిలోపడ్డారు. ఈ ఆఫర్ ఫల్ సేల్ ద్వారా సుమారు మూడు కోట్ల షేర్లను విక్రయించనున్నట్టు తెలుస్తోంది.
బీఎస్ఈలో మొత్తం 9,855 షేర్ హోల్డర్లుండగా, వారిలో 8,559 మంది పబ్లిక్ షేర్ హోల్డర్లు. వీరి వద్ద 55 శాతం వాటాలున్నాయి. మిగతా 1,296 మంది ట్రేడింగ్ సభ్యులు, వారి అసోసియేట్స్, ఇప్పటివరకూ మొత్తం 262 మంది వాటాదారులు తమ వాటాలను అమ్మకానికి ఉంచినట్టు తెలుస్తోంది. బీఎస్ఈలో టాప్ 8 వాటాదారులుగా ఉన్న ఎస్‌జీఎక్స్ సహా వివిధ ఇనిస్టిట్యూషన్స్ 2.99 కోట్ల వాటాలను ఐపీఓలో భాగంగా అమ్మదలిచాయి. ఇక వాటాలను విక్రయించే వారిలో ఈనామ్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు నిమీష్ ఎస్ షా, షేర్ ఖాన్, దమానీ ఫైనాన్స్ కు చెందిన రమేష్, సెంట్రమ్ బ్రోకింగ్, ఎంకే గ్లోబల్, ఐడీబీఐ కాపిటల్స్, జేఎం ఫైనాన్షియల్ తదితర సంస్థలు, ప్రముఖులు ఉన్నారు. ఒక్కో వాటా ధర రూ. 400 నుంచి రూ. 650 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
More Telugu News
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక