అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే విపక్ష వైకాపా సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి ప్లకార్డులు పట్టుకుని 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అని నినాదాలు చేస్తూ, సభా కార్యకలాపాలకు ఆటంకం కల్పిస్తుంటే, స్పీకర్ కోడెల కల్పించుకున్నారు. జగన్ మాట్లాడేందుకు అవకాశం ఇస్తూ, "మీకు ఎన్నిసార్లు చెప్పాను జగన్ మోహన్ రెడ్డి గారూ... మీరు మాట్లాడితేనే మీ సభ్యులు సీట్లలో కూర్చుంటారు. మిగతా ఎవరు మాట్లాడినా పోడియంలోకి దూసుకొస్తారు. అసెంబ్లీ ఉద్యోగుల్లో లేడీస్ ఉన్నారు. వారిని సీట్లలో కూర్చోనీయడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. యూ కెనాట్ హైజాక్ ది హౌస్. దయచేసి సహకరించండి" అన్నారు.
ఆపై జగన్ మాట్లాడుతూ, ఇదే సభలో పలుమార్లు ప్రత్యేక హోదాపై తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. నిన్నటి జైట్లీ ప్రకటన తరువాత దాన్ని స్వాగతిస్తున్నట్టు చంద్రబాబు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఈ దశలో ఆయన మైక్ ను కట్ చేసిన స్పీకర్, ఇదే విషయమై సభలో ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వ ప్రకటన విన్న తరువాత చర్చిద్దామని చెప్పారు. సభలో వైకాపా సభ్యుల నిరసన కొనసాగుతోంది.
More Telugu News
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్