నిద్రపోతున్న మూడేళ్ల కుమార్తెను కారులో వదిలేసి డోర్ లాక్ చేసి, తల్లిదండ్రులు టిఫిన్‌కు వెళ్లారు. నిద్రలేచిన చిన్నారి ఏడుస్తూ లోపల నుంచి విండో బాదుతుంటే, గుమిగూడిన స్థానికులు కారు డోర్‌ను బద్దలుకొట్టి పాపను బయటకు తీశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
హైదరాబాద్‌కు చెందిన దంపతులు కారులో బెంగళూరు బయలుదేరారు. శంషాబాద్ చేరుకున్న తర్వాత టిఫిన్ చేయాలని భావించిన వారు నిద్రిస్తున్న కుమార్తెను కారులోనే వదిలి హోటల్‌కు వెళ్లారు. వారు వెళ్లిన కాసేపటికే నిద్రలేచిన బాలిక తల్లిదండ్రులు కనిపించకపోవడం, కారు లాక్ చేసి ఉండడంతో ఏడుపు మొదలు పెట్టింది. కారులో ఏడుస్తున్న చిన్నారి విండో బాదుతూ కనిపించడంతో ఏ జరిగిందోనని స్థానికులు గుమిగూడారు. కారు డోర్ తెరిచే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.
కారు డోర్‌ను ఎలా తీయాలో సైగల ద్వారా చెప్పినా చిన్నారి అర్థం చేసుకోలేక మరింత ఏడుపు మొదలుపెట్టింది. చివరికి ఓ వ్యక్తి బలవంతంగా డోర్ తెరిచి పాపను బయటకు తీశాడు. ఈలోగా పాప తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలిసి తల్లిదండ్రులపై అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాప నిద్రిస్తుండడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని వారికి సర్దిచెప్పారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు.
More Telugu News
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక