రిజర్వేషన్ల కోసం హర్యానాలో కొనసాగుతున్న జాట్ ల ఆందోళన హింసాత్మకంగా మారింది. జాట్ ల మెరుపు ఆందోళనతో హర్యానా సర్కారు దిగివచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. సాక్షాత్తు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జాట్ ల ఆందోళనపై స్పందించారు. ‘మీ డిమాండ్లను నెరవేరుస్తాం... ఆందోళన విరమించండి’ అని ఖట్టర్ ప్రకటించినా, జాట్లు ససేమిరా అంటున్నారు. సీఎం హామీలో స్పష్టత కనిపించడం లేదని చెబుతున్న జాట్లు... తమకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తేనే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు.
ఆందోళనల్లో భాగంగా శనివారం మరింత రెచ్చిపోయిన జాట్లు... ఢిల్లీ తాగు నీటి అవసరాలకు ప్రధానాధారంగా ఉన్న మ్యూనక్ కాల్వ గేట్లను బద్దలు కొట్టారు. దీంతో ఢిల్లీకి జల రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గేట్లు బద్దలు కావడంతో మ్యూనక్ కాల్వ నుంచి వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయడం అధికార యంత్రాంగానికి సాధ్యం కావడం లేదు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీ ప్రజలు తీవ్ర తాగు నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో నిన్న ఢిల్లీ జల బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. పొంచి ఉన్న తాగు నీటి ఎద్దడి ముప్పు నుంచి తప్పించుకునేదెలాగా? అంటూ బోర్డు తల పట్టుకుంది.
ఇక హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్లే అన్ని రోడ్లను జాట్లు దిగ్బంధించారు. దీంతో హర్యానా నుంచి ఢిల్లీకి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఢిల్లీ ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలు ప్రధానంగా హర్యానా నుంచే సరఫరా అవుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలిచిన నేపథ్యంలో ఢిల్లీలో నిత్యావసరాలు... ప్రధానంగా కూరగాయలు దొరకడం లేదు. అరకొరగా దొరుకుతున్నా ధరలు మండిపోతున్నాయి. దీంతో జాట్ల డిమాండ్లపై కేంద్రం కూడా దృష్టి సారించక తప్పని పరిస్థితి నెలకొంది.
More Telugu News
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి