అజర్ బైజాన్ లో దారుణం చోటుచేసుకుంది. తమ అభిమాన సాకర్ ఆటగాడిపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఓ జర్నలిస్టును సదరు ఆటగాడి ఫ్యాన్స్ చావబాదారు. దాంతో, ఈ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళితే... ఐరోపా లీగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో అజర్ బైజాన్ కు చెందిన గబాలా ఎఫ్ కే ఫుట్ బాల్ క్లబ్, సైప్రస్ కు చెందిన అపోలాన్ లిమాసోల్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో గబాలా స్టార్ స్ట్రయికర్ జావిద్ హుస్సేనోవ్ సైప్రస్ అభిమానుల ఎదుట టర్కీ జెండా ఊపుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. టర్కీ, సైప్రస్ మధ్య సంబంధాలు అంతంతమాత్రమే కావడంతో, ఈ చర్య సైప్రస్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.
దీనిపై హుస్సేనోవ్ ను ప్రశ్నించిన సైప్రస్ జర్నలిస్టుకు అవమానం ఎదురైంది. హుస్సేనోవ్ అసభ్యకర సంజ్ఞ చేశాడు. ఇది చూసిన అజర్ బైజాన్ కు చెందిన కాసిమ్ అలియేవ్ అనే పాత్రికేయుడు హుస్సేనోవ్ చర్యను తప్పుబడుతూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. హుస్సేనోవ్ చర్య అనైతికమని పేర్కొన్నాడు. దాంతో, ఆ సాకర్ ఆటగాడి అభిమానులు రెచ్చిపోయారు. సదరు జర్నలిస్టుపై దాడికి దిగారు. తీవ్రగాయాలపాలైన అలియేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనపై అజర్ బైజాన్ అధ్యక్షుడు విచారణకు ఆదేశించారు.
More Telugu News
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి