ప్రపంచ ఐటీ రంగానికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినవారికి ఎదురైన ప్రశ్నల్లో కొన్ని సిల్లీ ప్రశ్నలు కూడా ఉన్నాయి. అభ్యర్థి స్పాంటేనియస్ స్పందన ఎలా ఉంటుందన్నది తెలుసుకునేందుకే ఈ తరహా ప్రశ్నలను సంధిస్తారు. అటువంటి వాటిల్లో కొన్ని ఇవి.
* భూమి గుండ్రంగా ఎందుకుంది?
(ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం కోసం 'ట్విట్టర్' అడిగిన ప్రశ్న)
* నీ పేరు పక్కన ఓ తోక ఉందనుకో... దాని గురించి ఏమి చెబుతావు?
(అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ పోస్టు కోసం 'యాహూ' వేసిన ప్రశ్న)
* శాన్ జోస్ లో ఎన్ని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి?
(క్వాలిటీ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ పోస్టు కోసం 'అడోబ్' వేసిన ప్రశ్న)
* సియాటెల్ లో ఉన్న అన్ని కిటికీలనూ శుభ్రం చేయాలంటే ఎంత కూలీ తీసుకుంటావు?
(ఆన్ లైన్ సేల్స్ ఆపరేషన్స్ పోస్టుకు 'ఫేస్ బుక్' సంధించిన ప్రశ్న)
* నిద్రలేచేసరికి 2 వేల ఈ-మెయిల్స్ వచ్చాయి. వాటిల్లో 300 మాత్రమే చూడగలిగితే, ఏ మెయిల్స్ చూస్తావు?
(రొటేషన్ ప్రోగ్రామ్ పొజిషన్ కు 'డ్రాప్ బాక్స్' వేసిన ప్రశ్న)
* విమానం కూలి నువ్వొక్కడివే బతికితే ఏం చేస్తావు?
(ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఇన్వెస్టిగేటర్ పొజిషన్ కు 'ఎయిర్ బీఎన్బీ' వేసిన ప్రశ్న)
* ప్రతి రోజూ ప్రపంచంలో ఎంతమంది పుడుతున్నారు?
(గ్లోబల్ సప్లయ్ మేనేజర్ పొజిషన్ కు 'యాపిల్' అడిగిన ప్రశ్న)
* నువ్వోక చెట్టుగా మారాలంటే, ఏ చెట్టుగా అవుతావు?
(సీనియర్ టెక్నికల్ రైటర్ పోస్టుకు 'సిస్కో' అడిగిన ప్రశ్న)
* రెండు సూపర్ పవర్ లలో (మాయం కావడం, గాల్లో ఎగరడం) ఒకటి కోరుకోమంటే ఏది కోరుకుంటావు?
(హై లెవల్ ప్రొడక్ట్ లీడ్ పోస్టు కోసం 'మైక్రోసాఫ్ట్' వేసిన ప్రశ్న)
* వెయ్యేళ్ల పాటు బతికేవారితో కలసి పనిచేయాల్సి వస్తే ఏం చేస్తావు?
(కంటింజంట్ వర్క్ ఫోర్స్ లో ఉద్యోగార్థికి 'లింకెడ్లిన్' అడిగిన ప్రశ్న)
ఈ తరహా ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పామన్నది ముఖ్యం కాదు. ఎంత వేగంగా చెప్పామన్నది, ఎంత వాస్తవికతకు దగ్గరగా ఉందన్నదే ముఖ్యం.
More Telugu News
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక