దాదాపు ఏడాది పాటు అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించిన గోదావరి మహా పుష్కరాలు నాలుగో రోజుకు చేరాయి. మరో 8 రోజుల్లో ముగిసిపోతాయి. ఆ తరువాత... వచ్చే సంవత్సరం దాదాపు ఇదే సమయానికి కృష్ణమ్మకు పుష్కర శోభ వస్తుంది. ఎక్కడో పడమటి కనుమలలో ఉన్న మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించి, అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో లక్షలాది ఎకరాల పంటను సస్యశ్యామలం చేస్తూ, 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గురుడు కన్యారాశిలో ప్రవేశించే శుభ ముహూర్తాన కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి.
గోదావరి పుష్కరాలు ముగియగానే, ఆంధ్రప్రదేశ్ సర్కారు కృష్ణా పుష్కరాలపై దృష్టి పెట్టనుంది. ఈ నెలాఖరులో విజయవాడలో కృష్ణా పుష్కరాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం కార్యాలయం నుంచి నదికి ఆనుకొని వున్న జిల్లాల కలెక్టర్లకు సమాచారం వెళ్లింది. జూలై 2016లో జరిగే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన నివేదిక సిద్ధం చేయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. కాగా, కృష్ణా పుష్కరాలు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సంగమేశ్వరం, మహబూబ్ నగర్ జిల్లా అలంపురం, తెలంగాణ, ఏపీల సరిహద్దుల్లోని నాగార్జున సాగర్, నల్గొండ జిల్లాలోని మట్టపల్లి, గుంటూరు జిల్లాలోని సత్రశాల, అమరావతి, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం, కృష్ణా జిల్లాలోని విజయవాడ తదితర ప్రాంతాల్లో వైభవంగా జరగనున్నాయి.
More Telugu News
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు