కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ కు చెందిన సెల్ ఫోన్ రికార్డులకు సంబంధించిన నివేదికను డైరక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఫోరెన్సిక్ పరీక్షలో వెలుగులోకి వచ్చిన విషయాలను మరింతగా విశ్లేషిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బాస్సి అన్నారు. ఓ వారం కిందట ఈ నివేదికలు తమకు వచ్చాయని, ప్రస్తుతం వాటిని విశ్లేషించే పనిలో ఉన్నట్టు చెప్పారు. సునందా బ్లాక్ బెర్రీ ఫోన్, ట్విట్టర్ నుంచి తొలగించిన కొంత సాక్ష్యాన్ని తిరిగి సంపాదించామని, అందులో, కావాలని డిలీట్ చేసిందేమైనా ఉందా? అని చూస్తామని వివరించారు.