వ్యక్తిగత ఆస్తుల వెల్లడికి సంబంధించి బీజేపీ, తన ఎంపీలకు మరోమారు గట్టి హెచ్చరికను జారీ చేసింది. పార్టీకి చెందిన ప్రతి ఎంపీ తమ ఆస్తులను స్వచ్ఛందంగా వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆదేశాల మేరకు ఆ గడువు నేటితో ముగియనుంది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో నిన్నటి భేటీలో పార్టీ సీనియర్లు దీనిపై చర్చించారు. నిర్ణీత గడువులోగా ఆస్తులు వెల్లడించని ఎంపీలపై కఠిన చర్యలు తప్పవని మోదీ హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్య నేతలు పార్టీ ఎంపీలకు గుర్తు చేశారు.
సుపరిపాలన దిశగా అడుగులేస్తున్న ప్రధాని మోదీ, అటల్ బిహారీ వాజ్ పేయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న సుపరిపాలన దినంగా పాటించనున్నారు. ఈలోగానే పార్టీ ఎంపీలు ఆస్తులను వెల్లడించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఇప్పటికే చాలా మంది ఎంపీలు తమ ఆస్తులను వెల్లడించారు. ఇంకా కొంతమంది తమ ఆస్తులను వెల్లడించలేదు. ఈ రోజు సాయంత్రం లోగా వారు తమ ఆస్తుల చిట్టాను అందజేస్తారనుకుంటున్నాను’ అంటూ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
More Telugu News
-
సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక
-
ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్