సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకలను శనివారం పార్టీ శ్రేణులు గందరగోళం నడుమ నిర్వహించాయి. ములాయం వయసెంతో కచ్చితంగా తెలియకుండానే నేతలు, కార్యకర్తలు వేడుకలు జరిపారు. కొందరు ములాయంకు 77వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారట. మరికొందరు ఆయన 76 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటూ ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మిగిలిన వారు నవంబర్ 22వ తేదీని ములాయం 75వ జన్మదినంగా సెలబ్రేట్ చేసుకున్నారు. గోలు యాదవ్ అనే మాజీ ఆఫీస్ బేరర్ భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు. దాంట్లో ములాయంకు 77వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అధినేత వెయ్యేళ్లు బతకాలని అందులో ఆకాంక్షించారు.
ములాయం వయసుపై అడగ్గా, ఆయన వయసు కచ్చితంగా తెలియదని, అయితే, వయసు తెలియకున్నా, ఈ స్థాయిలో సంబరం చేసుకోవడం సరైనదే అని చెప్పుకొచ్చారు గోలు. ఇక, అఖిల్ యాదవ్- బ్రాహ్మిణ్ మహాసభ వారైతే 76వ జన్మదినంగా భావించి పెద్ద ఎత్తున యాగం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం తమవంతుగా 75వ పుట్టినరోజు వేడుకలు జరిపారు. స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు... ములాయం వయసెంతో తెలియకుండానే. ములాయం 1939 నవంబర్ 22న జన్మించారు. ఉత్తరప్రదేశ్ లోని ఇటావా ప్రాంతంలోని సైఫాయి ఆయన జన్మస్థలం.
More Telugu News
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు