గోదావరి నది పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. మంత్రులు యనమల, పీతల సుజాత, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. దేశం గర్వపడేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన అనంతరం ఆంధ్రలో కలిసిన మండలాల్లోని స్నానఘట్టాలను అభివృద్ధి చేయాలని సూచించారు.