టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు త్వరలోనే భారతరత్న వస్తుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు వారి ఖ్యాతిని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని సుజనా కొనియాడారు. తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఓ ఆరాధ్యదైవమని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడం తెలుగువారందరికీ గర్వకారణమని తెలిపారు. నిన్న మోత్కుపల్లి దీక్ష చేస్తున్న సందర్భంగా ప్రసంగించిన సుజనా చౌదరి పైవ్యాఖ్యలు చేశారు.