ఓ మిస్డ్ కాల్ రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని పర్తాపూర్ జీవన్ సాహి ఏరియాలో నివసించే మోబిన్ అనే వ్యక్తి సెల్ ఫోన్ కు ఓ మిస్డ్ కాల్ వచ్చింది. తిరిగి కాల్ చేస్తే స్పందన కనిపించలేదు. వెంటనే, తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ చేయగా, అవతలి వ్యక్తి స్థానికుడే అని తేలింది. అతడి కుటుంబంతో మోబిన్ కుటుంబానికి ఎప్పటినుంచో గొడవలున్నాయి. దీంతో, మోబిన్, అవతలి వ్యక్తి ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకున్నారు. తీవ్ర హెచ్చరికలు చేసుకున్నారు.
ఈ ఫోన్ వాగ్యుద్ధం అనంతరం, ప్రత్యర్థి కొందరు వ్యక్తులను వెంటేసుకుని వచ్చి మోబిన్ నివాసంపై దాడికి దిగాడు. వారు లైసెన్స్ డ్ నాటు తుపాకులతో మోబిన్ ఇంటిపై కాల్పులు జరిపారు. దీంతో, మోబిన్ కుటుంబం ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కాల్పులకు దిగిన వారిని చెదరగొట్టారు. పరిస్థితి సద్దుమణిగిందనుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే, మోబిన్ ప్రత్యర్థి ఈసారి మరింత మందితో దాడి చేశాడు.
వారు కిటికీలు పగులగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా, ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన టూ వీలర్లకు నిప్పు పెట్టారు. వారించబోయిన వ్యక్తులను మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా కొట్టారు. ఈ ఘర్షణలో అరడజను మందికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. దీంతో, భారీ ఎత్తున పోలీసులు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాయి. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
More Telugu News
-
ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!
-
ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు