ప్రధాని పీఠమెక్కడంతో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అధ్యక్ష పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. ప్రధాని తన రాజీనామా లేఖను పంపినట్లు జీసీఏ కార్యదర్శి రాజేష్ పటేల్ తెలిపారు. 2009 సెప్టెంబర్ 15న మోడీ జీసీఏ అధ్యక్ష పదవిని చేపట్టారు. కాగా, జూన్ 13న జరిగే సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని రాజేష్ పటేల్ తెలిపారు. ప్రధాని అయ్యాక మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి, వడోదర లోక్ సభ సభ్యత్వానికి, మణినగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.