ఎన్డీయేకు మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదు: బీజేడీ
ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే బీజేపీకి మరో పార్టీ స్నేహ హస్తం అందించింది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైతే షరతులతో కూడిన మద్దతు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని బీజూ జనతాదళ్ నేత ప్రవత్ త్రిపాఠీ తెలిపారు. మొత్తం దేశవ్యాప్త అభిప్రాయం, ఒడిశా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.