ముంబైలోని బాంబే హాస్పిటల్ లో ఓ ఎయిడ్స్ రోగి తోటి రోగులపై దాడి చేశాడు. జనరల్ వార్డులో చికిత్స తీసుకుంటున్న 42 ఏళ్ల ఎయిడ్స్ రోగి ఒక్కసారిగా సెలైన్ స్టాండ్ తీసుకుని నిన్న దాడికి దిగాడు. ఈ దాడిలో ఠాకూర్ అనే రోగి తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. మరో రోగి తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.