ఇరాన్ వెళ్లిన నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇరాన్ వెళ్లారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటన కోసం ఆయనతో పాటు ఆయన సలహాదారు, పలు కీలక శాఖల మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా పొరుగుదేశం సౌదీ అరేబియాతో సంబంధాలను పెంచుకోవడం కూడా ప్రధాన లక్ష్యం.