పీసీ.పరేఖ్, కుమార మంగళం బిర్లాపై ఈడీ కేసులు
సంచలనం సృష్టించిన బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో ఈడీ దర్యాప్తు, కేసుల నమోదు చకచకా జరిగిపోతోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇప్పటికి పదహారు కేసులను ఈడీ నమోదు చేసింది. ఇందులో తాజాగా బొగ్గు శాఖ మాజీ సెక్రెటరీ పీసీ.పరేఖ్, హిందాల్కో ఛైర్మన్ కుమార మంగళం బిర్లా గ్రూపుపైన కేసులు నమోదయ్యాయి. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్ పై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.