విజయవాడలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
విజయవాడలో కురిసిన భారీ వర్షం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ రైల్వే స్టేషన్ లో భారీగా వర్షపు నీరు చేరింది. ఒకటో నెంబరు ఫ్లాట్ ఫారమ్ నుంచి ఏడో నెంబరు ఫ్లాట్ ఫారమ్ వరకు నీరు నిలిచిపోవడంతో ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విజయవాడ పరిధిలోని పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో స్టేషన్ లో ప్రయాణికులు రైళ్ల కోసం నిరీక్షిస్తున్నారు.