ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు విశాఖ చేరుకున్నారు. కొత్త రాజధాని ప్రత్యామ్నాయాలపై రేపటి నుంచి కమిటీ సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో పర్యటించనుంది. నేటి నుంచి 14 వరకు తొలి పర్యటన చేస్తారు. ఇందులో భాగంగా నేడు విశాఖ, 10న రాజమండ్రి, 11న విజయవాడ, 12న గుంటూరు ప్రాంతాల్లో కమిటీ సభ్యులు పర్యటిస్తారు. 13, 14న హైదరాబాదులో ఉన్నతాధికారులతో కమిటీ సమావేశమై రాజధాని ఎంపికపై చర్చిస్తారు.