జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు బయల్దేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి బయల్దేరిన ఈ రైలు దువ్వాడకు రాగానే బోగీలను వదిలి ఇంజిన్ ముందుకు వెళ్లిపోయింది. ఆ విషయాన్ని వెంటనే గమనించిన డ్రైవర్ అప్రమత్తమై... ఇంజిన్ ను వెంటనే బోగీల వద్దకు మరలించి, రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఇంజిన్ బోగీల మధ్య ఉన్న లింక్ ను రైల్వే సిబ్బంది సరిచేశారు. ఈ ఘటనతో రైలు కొద్దిగా ఆలస్యంగా ముందుకు కదిలింది.