గుంటూరు జిల్లాలో దొంగ నోట్లు పంచుతున్నారంటూ కలకలం రేగింది. సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు దొంగ నోట్లు పంచుతుండగా, వాటిని తీసుకునేందుకు స్థానికులు తిరస్కరించారు. సత్తెనపల్లి పట్టణం, దొండపాడు, చాగంటివారిపాలెంలో వైఎస్సార్సీపీ నేతలు దొంగ నోట్లు పంచుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు.