ఉస్మానియా వర్శిటీ క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం శాసనసభ రెండు పర్యాయాలు వాయిదా పడిన విషయం విదితమే. శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై వెంటనే అసెంబ్లీలో చర్చ జరపాలంటూ ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను ఎన్.సి.సి. గేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను నిలువరించేందుకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే, బ్యారికేడ్లను దాటి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ర్యాలీని ముందుకెళ్లనీయాలంటూ విద్యార్థులు ఆగ్రహంతో పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు.
More Telugu News
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు
-
అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
-
తిరుమల అప్డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
-
ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్
-
భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
-
యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
-
రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!
-
మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్
-
పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం
-
పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్ సంచలన ప్రకటన!
-
అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!
-
బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!
-
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్
-
వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక