అత్యవసరంగా దిగిన సౌదీ విమానం.. 29 మందికి గాయాలు
సౌదీ అరేబియాకు చెందిన ఎయిర్ లైన్స్ బోయింగ్ 767 విమానం మదీనాలో అత్యవసరంగా దిగింది. దీంతో 315 మంది ప్రయాణికులు ఉన్న విమానంలో 29 మంది గాయపడినట్టు ఆ దేశ విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ విమానం ఇరాన్ లోని మషాద్ కు వెళుతుండగా గేర్లు పనిచేయకపోవడంతో అత్యవసరంగా కిందికి దించినట్టు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.