థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఉద్యమకారులు కదం తొక్కుతున్నారు. ప్రధాని ఇంగ్లక్ షినవ్రత రాజీనామా చేయాలంటూ ప్రభుత్వ వ్యతిరేక పక్షాలు కవాతు నిర్వహించాయి. 7.5 కిలోమీటర్లు సాగిన కవాతులో ఉద్యమకారులు ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే థాయ్ పార్లమెంటును షినవ్రత రద్దుచేశారు. ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.