ఆ డ్రస్సు ఎవర్ గ్రీన్ హాట్!
ఏ డ్రస్సయినా ఒకనాటికి పాతబడిపోతుంది. కానీ ఒక డ్రస్సు మాత్రం ఏళ్లు గడిచినా ఇంకా కొత్తగానే, హాట్ హాట్‌గానే కనిపిస్తుందట. అదేమంటే మార్లిన్ మన్రో నటించిన ఒక డ్రస్సు. ఒకనాటి అందాల తార మార్లిన్ మన్రో నటించిన 'ది సెవెన్ ఇయర్ ఇచ్' చిత్రం 1955లో విడుదలైంది. ఈ చిత్రంలో మన్రో ఒక తెల్లటి డ్రస్‌ను వేసుకుంది. ఈ డ్రస్సు మాత్రం ఇప్పటికీ హాటేనని ఒక సర్వేలో తేలింది.
సినిమాల్లో ధరించిన డ్రస్సులపై బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 'ది సెవెన్ ఇయర్ ఇచ్' సినిమాలో మార్లిన్ మన్రో ధరించిన తెల్లటి దుస్తులు మొదటి స్థానంలో నిలిచాయి. తర్వాత 'ది విజర్డ్ ఆఫ్ ఆజ్' చిత్రంలో డొరోతీ ధరించిన దుస్తులు రెండవ స్థానంలో నిలిచాయి.