మోడీ సాబ్.. కేజ్రీవాల్ ను చూసి నేర్చుకో: దిగ్విజయ్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని మరోసారి టార్గెట్ చేశారు. పొదుపు, వినమ్రతలంటే ఏంటో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలను చూసి నేర్చుకోవాలని మోడీకి సూచించారు. 'కేజ్రీవాల్, మమత 'వాగన్ ఆర్ మారుతీ' కార్లు వాడుతున్నారు.. మీరు నానో అయినా వాడాలి కదా' అంటూ ట్వీట్ చేశారు. నానో ప్లాంట్ గుజరాత్ లోనే ఉన్న విషయం గమనార్హం.