ఈ రోజు హైదరాబాదులోని మంత్రి పితాని సత్యనారాయణ నివాసాన్ని ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఆధార్ తో ముడిపెట్టరాదని వీరు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వీరు తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఈ సందర్భంగా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి నివాసం వద్ద కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.