ముస్లిం నేతలపై కేసులు ఎత్తేసేందుకు రంగం సిద్ధం
శవాలపై మరమరాలు ఏరుకున్న చందంగా.. ముజఫర్ నగర్ మత ఘర్షణల నుంచి ఉత్తరప్రదేశ్ లోని అఖిలేశ్ యాదవ్ సర్కారు లబ్ధి పొందే ఎత్తుగడలో ఉంది. అక్కడ గతేడాది సెప్టెంబర్ లో ఇరు మత వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తి 60 మంది వరకూ మరణించగా.. వందల మంది నిరాశ్రయులయ్యారు. వీటికి సంబంధించి దాఖలైన 570కిపైగా కేసులను సిట్ విచారిస్తోంది. బీఎస్పీ, బీజేపీ సహా ముస్లిం నేతలపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి.
అయితే, ముస్లిం నేతలపై మాత్రమే కేసులను ఎత్తేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఎమ్మెల్యేలు నూర్ సలీమ్, జమీల్ అహ్మద్, కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి సయీద్ ఉచ్ జమాన్, ఆయన కొడుకు సయీద్, ఇతర ముస్లిం మతనేతలతోపాటు బీఎస్పీ ఎంపీ కదీర్ రాణాలపై ఉన్న కేసులు ఎత్తి వేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి యూపీ న్యాయశాఖ జిల్లా కలెక్టర్ల అభిప్రాయాన్ని కూడా కోరింది.