180 కోట్ల రూపాయల మేర మోసం చేశారన్న వ్యవహారంలో, హైదరాబాదులోని ఎంబీఎస్ జ్యువెలర్స్ యజమాని సుఖేష్ గుప్తాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బంగారం కొనుగోళ్లకు సంబంధించి దిగుమతి సుంకం చెల్లించలేదని ఎంఎంటీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుప్తాను సీబీఐ విచారిస్తోంది. ఈ వ్యవహారంలో గుప్తాతో పాటు మరో నలుగురిపై ఎంఎంటీసీ కేసు పెట్టింది.