జీ తెలుగు సమ్మర్ ట్రీట్: 'అఖండ 2' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఏప్రిల్ 26న సాయంత్రం 5:30 గంటలకు!

జీ తెలుగు సమ్మర్ ట్రీట్: 'అఖండ 2' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఏప్రిల్ 26న సాయంత్రం 5:30 గంటలకు!

హైదరాబాద్, 23 ఏప్రిల్ 2026: వేసవి ఎండలు పెరుగుతున్న వేళ, ప్రేక్షకులకు ఉల్లాసాన్ని కలిగించే వినోదాన్ని పంచేందుకు జీ తెలుగు సిద్ధమైంది. ప్రతి ఇంట్లోనూ అద్భుతమైన సినిమా అనుభూతిని అందించాలనే లక్ష్యంతోఈ వేసవిలో 'సమ్మర్ ఎంటర్టైన్మెంట్ బొనాంజా'ను అందిస్తోంది. ఇందులో భాగంగాబాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'అఖండ 2' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది. 

బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) సైంటిస్ట్. శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియా పై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడి పై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఆ ఉద్రిక్త సంఘటనలను సృష్టించిన దుండగులపై అఖండ (బాలయ్య) ఎలా విరుచుకుపడ్డాడు ?, దేశాన్ని ఎలా కాపాడాడు ?, ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు ?, అఖండ తల్లి కోరిక తీరిందా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగు వేదికగా ప్రసారమయ్యే అఖండ 2 చూడాల్సిందే!

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. సింహాలెజెండ్అఖండ వంటి వరుస ఇండస్ట్రీ హిట్లతో రికార్డులు తిరగరాసిన నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబోఅఖండ 2తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన సంగీతంవెన్నులో వణుకు పుట్టించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ఆధ్యాత్మిక యాక్షన్ విజువల్ వండర్‌కు ప్రాణం పోశాయి. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ని ఈ ఆదివారం మీరూ తప్పకుండా చూసేయండి!

బాక్సాఫీస్ బ్లాక్బస్టర్ హిట్ అఖండ 2, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకుమీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

 

Akhanda
Balakrishna
Zee Telugu

Watch Today's Deals on Amazon

More Press News