పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా "మయూఖ". ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మించారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఇటీవలే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన "మయూఖ" సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని "మయూఖ" సినిమా టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా
ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ- ఒక సినిమా రిలీజై నెక్ట్స్ ఫ్రైడే చూడటం అనేది అరుదు. అలాంటిది 25 రోజులు థియేటర్స్ లో సినిమా రన్ కావడం అంటే ఈజీ కాదు. అలాంటి ఘనత సాధించిన "మయూఖ" టీమ్ ను అభినందిస్తున్నా. ఈ రోజు చిన్న చిత్రాలు థియేటర్స్ లో ఆడటం ఎంత కష్టమైందో మనం చూస్తున్నాం. ఈ టీమ్ ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ పాయల్ చెంగప్ప మాట్లాడుతూ - తెలుగులో నాకు ఇది ఫస్ట్ మూవీ. మా టీమ్ కూడా కొత్త వాళ్లే. ఇలాంటి కొత్త టీమ్ కు పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. ఈ రోజు మా సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా మూవీ రిలీజ్ కు ముందే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మిస్టరీ మూవీ అవార్డ్ గెల్చుకుంది. మా డైరెక్టర్ కు కూడా అవార్డ్స్ వచ్చాయి. నాకు ఈ చిత్రంలో అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఈ విజయాన్ని అందుకోగలిగాం. మీ ఆదరణ ఇలాగే మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల మాట్లాడుతూ - థియేటర్స్ దగ్గర పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్ నిలబడని పరిస్థితి చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మా సినిమా థియేట్రికల్ గా 25 రోజుల సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతుండటం సంతోషంగా ఉంది. మా టీమ్ అందరికీ ఈ విజయం గర్వకారణం. మాది కంటెంట్ ఉన్న సినిమా, తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. నా మాటను ఆడియెన్స్ నిజం చేశారు. మంచి స్క్రిప్ట్, ప్లానింగ్, కష్టపడే టీమ్ ఉంటే మయూఖ లాంటి విజయం ఏ ప్రొడ్యూసర్ అయినా సాధించవచ్చు. అన్నారు.
డైరెక్టర్ శ్రీతేజ్ ఎస్. కె . మాట్లాడుతూ - నేను హనుమాన్ మాలలో ఉండే ఈ సినిమా ప్రమోషన్స్ చేశాను. ఆయన శక్తే మా సినిమాను ముందుకు నడిపించిందని నమ్ముతున్నాను. మేము ఏదో రన్ చేస్తున్నామని ఈ సినిమాను థియేటర్స్ లో రన్ చేయడం లేదు. నిన్న 25 డే మా టీమ్ థియేటర్స్ కు వెళ్లారు. దాదాపు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది. మా మూవీని ప్రేక్షకులు జెన్యూన్ గా ఆదరిస్తున్నారు. ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం చూసి నేను ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాను. మాది చిన్న సినిమా అని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ అభిరుచి గల ఆడియెన్స్ సక్సెస్ చేశారు. నేను స్టోరీ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ శశిధర్ గారు బడ్జెట్ ఏంటి, తీయగలడా లేదా అని ఆలోచించలేదు ఓకే మూవీ చేస్తున్నాం అన్నారు. ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టానని నమ్ముతున్నా. అలాగే మా హీరోయిన్ పాయల్ కూడా కథ చెప్పగానే నమ్మి చేశారు. ఈ సక్సెస్ కు కారణమైన మా టీమ్, మీడియా మిత్రులు అందరికీ నా థ్యాంక్స్. అన్నారు.
పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ - కంటెంట్ బాగున్న చిన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు. మేము ఎన్నో ఏళ్లుగా చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలుస్తున్నాము. మయూఖ సినిమా 25 రోజుల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ శ్రీతేజ్, ప్రొడ్యూసర్ శశిధర్ నాకు చాలాకాలంగా తెలుసు. మీ టీమ్ ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలి. మీ టీమ్ కు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరకు రావొచ్చు. చిన్న చిత్రాలకు ప్రభుత్వం తరుపున కూడా సపోర్ట్ అందేలా చేస్తాం. అన్నారు.