దీపావళి పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు జీ తెలుగు సిద్ధమైంది. నవంబర్ 7, శనివారం సాయంత్రం 5 గంటలకు ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’ ప్రసారం కానుండగా, నవంబర్ 8, ఆదివారం రాత్రి 7:30 గంటలకు ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ ప్రత్యేక ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అతిథిగా సందడి చేయనున్నారు. ప్రముఖ టెలివిజన్ తారలు, సినీ ప్రముఖులు, ప్రత్యేక ప్రదర్శనలు, అభిమానులతో భావోద్వేగ క్షణాలు.. ఈ రెండు కార్యక్రమాలు దీపావళి వారాంతాన్ని మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి.
బుల్లితెర తారలు, సినీ ప్రముఖుల సందడితో ఘనంగా జరగనున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్ 2 కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. టెలివిజన్ రంగంలో ఆమె 25 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసేలా ప్రత్యేక పరిచయంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకలో మధ్యాహ్నం మహానాయకుడు, ఐకానిక్ కపుల్, లవర్ బాయ్ ఆఫ్ జీ తెలుగు, సూపర్ క్వీన్ ఆఫ్ జీ తెలుగు, పాపులర్ ఫేస్ ఆఫ్ ప్రైమ్ టైమ్ ఫిమేల్, ఉత్తమ కథానాయకుడు, నవనాయకి, పాపులర్ ఫేస్ ఆఫ్ తెలుగు ZEE5 ఫిమేల్, తెలుగు అమ్మాయి, ఉత్తమ కోడలు వంటి విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు.
అద్భుతమైన ప్రదర్శనలు, ఆకట్టుకునే సంభాషణలతో కోలాహలంగా సాగనున్న ఈ వేడుకకు బాబు మోహన్, లయ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, మధుమిత, బ్రహ్మాజీ, లయ, నివేదా పేతురాజ్, బాబా భాస్కర్, గెహనా సిప్పీ, మానస వారణాసి వంటి పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేయనున్నారు. ప్రత్యేక ప్రదర్శనలు, అభిమానుల సర్ప్రైజ్లు, భావోద్వేగభరితమైన క్షణాలతో ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
ఇక దీపావళి ప్రత్యేక వినోదాల పరంపరలో భాగంగా నవంబర్ 8న ప్రసారమయ్యే ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో లోకేశ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకోనున్నారు.
ఒకవైపు సినీ, టెలివిజన్ ప్రముఖుల సందడితో అంగరంగ వైభవంగా జరిగే కుటుంబం అవార్డ్స్ వేడుక.. మరోవైపు మంత్రి నారా లోకేశ్‌తో జగపతిబాబు ప్రత్యేక సంభాషణ.. ఇలా ఈ దీపావళికి జీ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలను అందిస్తోంది.
దీపావళికి జీ తెలుగు అందిస్తున్న డబుల్ ధమాకా.. కుటుంబం అవార్డ్స్ పార్ట్ 2 శనివారం సాయంత్రం 5 గంటలకు, జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ఆదివారం రాత్రి 7:30 గంటలకు.. తప్పక చూడండి!