కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి
మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్ఎన్ఎస్ డెవలపర్స్ సంస్థ సీఎండీ కందాల శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో కొత్త వెంచర్‌కు సంబంధించి "లక్కీ డ్రా బొనాంజా" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు ఘర్షణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, కస్టమర్ల అభిమానం, మార్కెటింగ్ సిబ్బంది కృషితో తాము విజయవంతంగా 15వ వెంచర్‌ను ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా ఆలేరు సమీపంలోని కొలనుపాకలో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో లగ్జరీ రిసార్టులు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్కులతో పాటు ప్రత్యేకంగా ఎర్రచందనం మొక్కలను కూడా అందిస్తున్నామని తెలిపారు.

సాధారణ, దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా సులభంగా ఇళ్ల స్థలం కొనుగోలు చేసేందుకు వీలుగా నెలవారీ ఈఎంఐ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నటుడు ఘర్షణ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు.

More Press News

Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install