రేవంత్, కేటీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి: ఎంపీ రఘునందన్ రావు డిమాండ్
Advertisement

రేవంత్, కేటీఆర్‌ ఆస్తులపై విచారణ జరపాలి: ఎంపీ రఘునందన్ రావు డిమాండ్

Raghunandan Rao demands investigation into Revanth Reddy and KTR assets
  • రేవంత్, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు రఘునందన్ డిమాండ్
  • సోమవారం లోగా లేఖ రాయాలని, లేదంటే తానే రాస్తానని వెల్లడి
  • తన ఆస్తిపైనా విచారణకు సిద్ధమని ప్రకటించిన బీజేపీ ఎంపీ
తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల విచారణ సవాళ్లు మరింత ముదురుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలోని నేతలు దొంగలేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రేవంత్ రెడ్డి, కేటీఆర్ తమ ఆస్తులపై విచారణ కోరుతూ సోమవారం లోగా హైకోర్టుకు లేఖ రాయాలని రఘునందన్ సవాల్ విసిరారు. ఒకవేళ వారు స్పందించకపోతే, తానే స్వయంగా హైకోర్టుకు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే ముగ్గురం కలిసి సిట్టింగ్ జడ్జికి విచారణ కోసం విజ్ఞప్తి చేద్దామని, తన ఆస్తులపైనా విచారణకు తాను సిద్ధమేనని ప్రకటించారు.

ఇటీవల సిరిసిల్ల సభలో కేటీఆర్ ఆస్తుల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయగా, దానికి ప్రతిగా తమ ఇద్దరి కుటుంబాల ఆస్తులపైనా న్యాయ విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా ఈ అంశాన్ని తెరపైకి తేవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 
Advertisement
Raghunandan Rao
Revanth Reddy
KTR
Telangana Politics
Asset Investigation
BJP Telangana

More Telugu News