తిరుమలలో లోకేశ్, సింగపూర్ మంత్రి షణ్ముగం... కలిసి శ్రీవారి దర్శనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో లోకేశ్, సింగపూర్ మంత్రి షణ్ముగం... కలిసి శ్రీవారి దర్శనం

Nara Lokesh and Singapore Minister Shanmugam visit Srivari in Tirumala
  • తిరుమలకు వచ్చిన సింగపూర్ మంత్రికి లోకేశ్ ఆతిథ్యం
  • ఇరువురికీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ అధికారులు
  • దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, సింగపూర్ హోంమంత్రి కే షణ్ముగం మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కలిసి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం సోమవారం రాత్రే తిరుమల చేరుకున్న సింగపూర్ మంత్రికి, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు.
    
మంగళవారం ఉదయం షణ్ముగంతో కలిసి లోకేశ్ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వారికి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
     
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు సోమవారం రాత్రి మంత్రి లోకేశ్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకోగా, స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.   
   
Advertisement
Nara Lokesh
K Shanmugam
Tirumala Temple
Singapore Home Minister
Sri Venkateswara Swamy
TTD Tirupati

More Telugu News