జనవరి 1 నుంచి హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్: విజయవాడ సభలో చంద్రబాబు ప్రకటన
- అమరావతి క్వాంటం బయో వ్యాలీకి జాతీయ గుర్తింపునివ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం
- జనవరి 1 నుంచి రాష్ట్రంలో ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ ప్రకటన
- రూ.249 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాకులు, పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు ప్రారంభం
- డబుల్ ఇంజన్ సర్కార్‌తో వైద్య రంగానికి కొత్త ఊపు వచ్చిందన్న చంద్రబాబు
- కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
వైద్యారోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనవరి 1వ తేదీ నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నామని, ఇది వైద్య రంగంలో ఒక గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని ప్రకటించారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, తగిన సహకారం అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు.
శనివారం విజయవాడలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీని వారు సందర్శించి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన సభలో రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నాయి.
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పడిన డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. గత 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కొనియాడారు. దేశంలో మెడికల్ సీట్లను 51 వేల నుంచి రెట్టింపు చేశారని, కోవిడ్ సమయంలో ప్రపంచానికే వ్యాక్సిన్ అందించి భారత్ సత్తా చాటారని గుర్తుచేశారు. మంగళగిరి ఎయిమ్స్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు తక్కువ ధరకే మందులు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫార్మా రంగం దేశానికే తలమానికంగా ఉందని, మెడ్‌టెక్ పార్కు ద్వారా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని వివరించారు.
ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ధ్యేయం
ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సీఎం సూచించారు. "వంటశాలనే ఫార్మసీగా, ఆహారాన్నే ఔషధంగా" భావించాలని పిలుపునిచ్చారు. యోగా, ప్రాణాయామం వంటి సంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. వైద్యారోగ్య రంగానికి నిధులు కేటాయిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలుపుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ నిర్మాణమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు.
అమరావతి.. భవిష్యత్ టెక్నాలజీ హబ్
అమరావతిని భవిష్యత్ సాంకేతికతకు చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు వివరించారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్‌ను అమరావతిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అమరావతి గురించి లద్దాఖ్‌లో కూడా చర్చించుకునే పరిస్థితి వచ్చిందని, భవిష్యత్తులో ప్రపంచమంతా అమరావతి వైపు చూస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యే బోండా ఉమ, సోము వీర్రాజు సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ, అమరావతి, సంజీవని ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినప్పుడు సభికులు, వైద్య విద్యార్థులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగిశాక సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నడ్డాతో కలిసి వేదికపై నుంచే సెల్ఫీ తీసుకుని సభికులను ఉత్సాహపరిచారు.