భూకంపం వచ్చిందా? నేపాల్ జల విలయానికి కారణం ఇదేనా?
- నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు, 22 మంది మృతి
- 105 మంది భారతీయులతో సహా 348 మంది గల్లంతు
- భూకంపంతో కొండచరియలు విరిగిపడటమే కారణమని అనుమానం
- నేపాల్‌కు అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రధాని మోదీ హామీ
- మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారుల హెచ్చరిక
పొరుగు దేశం నేపాల్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. రసువా జిల్లాలోని భోటేకోశీ నదిలో సంభవించిన ఈ జల ప్రళయంలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా, 105 మంది భారతీయులతో సహా దాదాపు 348 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనతో రసువాతో పాటు ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈ ఆకస్మిక వరదల్లో అనేక గ్రామాలు, వంతెనలు, రోడ్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. బురద, శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు, 93 మంది నేపాల్ పౌరులు, 12 మంది బ్రిటిష్, ముగ్గురు అమెరికన్ పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భూకంపమే కారణమా?
ఈ దుర్ఘటనకు భూకంపం ప్రేరేపిత కొండచరియలే కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ పార్లమెంటుకు వివరించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో టిబెట్ భూభాగంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియలాజికల్ సర్వే (USGS) నమోదు చేసింది. ఈ భూకంపం ధాటికి భారీగా మంచు, రాళ్లతో కూడిన కొండచరియలు విరిగిపడి టిబెట్ వైపు ఉన్న లెండే ఖోలా నది ప్రవాహానికి అడ్డుపడ్డాయి. దీంతో తొలుత నీరు భారీగా నిలిచిపోయింది. ఆ ప్రవాహం అంతకంతకు అధికం కావడంతో, ఆ అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దాంతో భోటేకోశీ నదిలోకి వరద పోటెత్తిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
సహాయక చర్యలు.. భారత్ అండ
నేపాల్ సైన్యం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, వరద ఉద్ధృతి తగ్గకపోవడంతో హెలికాప్టర్లు దిగలేని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్‌లో మాట్లాడి సంతాపం తెలిపారు. అన్ని రకాల మానవతా సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసరాలు, మందులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. మరోవైపు, చైనా కూడా సరిహద్దుల్లో సహాయక బృందాలను మోహరించింది.
కాగా, నది ఎగువన ఇంకా అవరోధాలు ఉండటంతో మరోసారి వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి భారత సరిహద్దు రాష్ట్రాల్లోనూ వరద హెచ్చరికలు జారీ చేశారు.