బండి భగీరథ్ పోక్సో కేసు.. బాధితురాలికి హైకోర్టు నోటీసులు
- బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- బాధితురాలి వాదన వినేందుకు ఆమెకు నోటీసులు జారీ
- కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు
- ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. తనపై నమోదు చేసిన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఎలాంటి తప్పూ చేయలేదని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని భగీరథ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
అయితే బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలి వాదన కూడా వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలికి నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బండి భగీరథ్‌పై మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. అనంతరం పరారైన అతణ్ని మే 16న పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు వీలుగా ఈ నెల 20 నుంచి 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. గడువు ముగియడంతో గత వారం మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఎల్లుండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.