భారత్ లో అత్యంత సుదీర్ఘ రైలు ప్రయాణం ఇదే... 12 రాష్ట్రాల మీదుగా 3 మూడ్రోజుల జర్నీ!

Vivek Express longest train journey in India covers 12 states
  • వివేక్ ఎక్స్‌ప్రెస్: 3 రోజులు, 3 రాత్రుల అద్భుత ప్రయాణం
  • అసోం నుంచి కన్యాకుమారి... 4,100 కి.మీ. ప్రయాణం
  • స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా 2011లో ప్రారంభం
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల గుండా ప్రయాణం
భారత రైల్వే నెట్‌వర్క్‌లో వివేక్ ఎక్స్‌ప్రెస్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన రైలు మార్గంలో ప్రయాణించే ఘనత ఈ రైలు సొంతం. అసోంలోని దిబ్రూగఢ్‌లో ప్రారంభమై దేశపు దక్షిణ అంచున ఉన్న కన్యాకుమారి వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో రైలు సుమారు 4,155 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ఈ సుదీర్ఘ ప్రయాణానికి దాదాపు 74 నుంచి 75 గంటల సమయం పడుతుంది. అంటే, దాదాపు 3 పగళ్లు, 3 రాత్రులు ప్రయాణంలోనే గడపాల్సి ఉంటుంది. తన ప్రయాణ మార్గంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా దాదాపు 12 రాష్ట్రాల గుండా ఇది వెళుతుంది. గౌహతి, భువనేశ్వర్, విజయవాడ, చెన్నై వంటి ప్రధాన నగరాలతో పాటు మొత్తం 55కు పైగా స్టేషన్లలో ఆగుతుంది.

అసోంలోని తేయాకు తోటల నుంచి తూర్పు తీర మైదానాలు, సముద్ర ప్రాంతాల మీదుగా సాగే ఈ ప్రయాణం.. భారతదేశంలోని భిన్న సంస్కృతులు, వాతావరణం, ప్రకృతి దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అందుకే రైల్వే ప్రియులకు, వ్లాగర్లకు ఈ ప్రయాణం ఎంతో ఇష్టం.

స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని 2011లో ఈ రైలును ప్రారంభించారు. దూరం, ప్రయాణ సమయం పరంగా భారత రైల్వేల్లో ఇప్పటికీ ఇదే రికార్డును కొనసాగిస్తోంది.
Go Back to Shorts
Vivek Express
Indian Railways
longest train route
Dibrugarh
Kanyakumari
12 states journey
Indian train travel
длительный маршрут поезда
train route India
railway network

More Telugu News