భోపాల్‌లో 'పెద్ది కి ఆవాజ్'.. అభిమాన సంద్రం మధ్య అట్టహాసంగా ఈవెంట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భోపాల్‌లో 'పెద్ది కి ఆవాజ్'.. అభిమాన సంద్రం మధ్య అట్టహాసంగా ఈవెంట్!

Ram Charan Peddi Ki Awaaz Event Grand Success in Bhopal
  • భోపాల్‌లో అంగరంగ వైభవంగా పెద్ది కి ఆవాజ్ ఈవెంట్
  • ఏఆర్ రెహమాన్ సంగీత ప్రదర్శన
  •  వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్న చిత్ర బృందం
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల రాకతో అభిమానుల్లో భారీ ఉత్సాహం
  • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పెద్ది సినిమా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' ప్రమోషన్లలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 'పెద్ది కి ఆవాజ్' పేరుతో భారీ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చి ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. సినిమా విడుదలకు కేవలం 12 రోజుల ముందు, ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ మెగా కన్సర్ట్‌ను నిర్వహిస్తున్నారు.

ఈ ఈవెంట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీత ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆయన తన టీమ్‌తో కలిసి లైవ్‌లో "చికిరి చికిరి", "రై రై రా రా" వంటి పెద్ది చిత్రంలోని పాటలతో పాటు పలు హిట్ గీతాలను ఆలపించనున్నారు. 

ఇదే వేదికపై, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ సాంగ్‌ను 'పెద్ది' చిత్ర బృందం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగా, అభిమానులు భారీ కేరింతలతో స్వాగతం పలికారు. హీరోయిన్ జాన్వీ కపూర్ తదితరులు ఈవెంట్ కు హాజరయ్యారు. యూవీ మీడియా, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఈవెంట్, జూన్ 4న విడుదల కానున్న "పెద్ది"పై అంచనాలను తారాస్థాయికి చేర్చనుంది.
Advertisement
Ram Charan
Peddi
Peddi movie
Bhopal
AR Rahman
Janhvi Kapoor
Pan India movie
Chikiri Chikiri
Rai Rai Ra Raa
UV Media

More Telugu News